వేదాద్రి క్షేత్రం...వేదాద్రి భక్తుల నిత్యాన్నదాన సత్రం:

వేదాద్రి క్షేత్రం...శ్రీ నరసింహ స్వామి అవతరించిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రాల్లో ఒకటి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో కృష్ణా తీరంలో ఈ క్షేత్రం అలరారుతోంది. వేదాలను తనలో నిక్షిప్తం చేసుకున్న పర్వత ప్రాంతం కనుక ఈ ప్రాంతానికి వేదాద్రి అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో స్వామివారు ఐదు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేదాద్రి క్షేత్ర మహాత్యంను శ్రీనాధుడు తన 'కాశీ ఖండం'లో రాశారు. ఎర్రన, నారాయణ తీర్థులు కూడా తాము రచించిన కావ్యాల్లో వేదాద్రి క్షేత్ర ప్రస్తావన చేశారు. 

 ఆలయ చరిత్ర ` సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద నుంచి వేదాలను అపహరించి వాటిని సముద్ర గర్భంలో దాచారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని కలిగించమని కోరడంతో నరసింహావతారంలో తాను హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత ఆ కోరిక తీరుతుందని చెప్పారు. తనను అభిషేకించాలని కృష్ణవేణి కూడా ఆరాటపడుతుందని, అందువలన తాను వచ్చేంతవరకు ఆ నదిలో సాలగ్రామ శిలలుగా ఉండమంటూ అనుగ్రహించారు. ఆ తరువాత హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం స్వామి ఇక్కడే ఐదు అంశలతో ఆవిర్భవించాడు. 

 

annadamsatram            

 

 


 

పంచ నారసింహ రూపాలు:

హిరణ్యకశిపుని మరణానంతరం శ్రీ మహావిష్ణువు వీర, యోగ, జ్వాల, సాలగ్రామ, లక్ష్మీ నృసింహ రూపాల్లో ఇక్కడ కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. 

శ్రీ జ్వాలా నరసింహస్వామి ` కొండపైన స్వయంభూగా వెలిసి దర్శనమిస్తున్నారు. (కొండ గర్భంలో దేదీప్యమైన వెలుగులతో అనగా జ్వాలలతో కనిపిస్తారంటారు)

శ్రీ సాలగ్రామ నరసింహస్వామి ` సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారంటారు. కృష్ణానది గర్భంలో స్నానఘట్టమునకు సమీపంలో బయటకు కనిపించే రూపం సాలగ్రామము.

శ్రీ వీర నృసింహస్వామి ` ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో గరుడాచలం అనే కొండపై స్వయంభూగా కనిపిస్తారు.

శ్రీ యోగానంద స్వామి ` ఆలయంలో మూలవిరాట్‌గా ఉన్న శ్రీ యోగానంద స్వామిని త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి  ప్రతిష్ఠించారంటారు. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా సాలగ్రామ శిలతో ఈ రూపాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించారని ఐతిహ్యం.

 

శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ` మూలవిరాట్‌గా భక్తులకు కొలువయ్యారు. 

ఆలయంలో చెంచు లక్ష్మీ, రాజ్యలక్ష్మీ అమ్మవార్లకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. 

 దర్శన సమయాలు ` ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు

 సాయంత్రం 3.00 నుంచి 5.30 వరకు, మళ్ళీ 6.30 నుంచి 8.30 దాకా

 

 

పవిత్ర కృష్ణనదీ తీరానగల  పంచనారసింహ పుణ్య క్షేత్రం వేదాద్రిలో గల శ్రీ వేదాద్రి గోశాలలో కబేళాకు పోకుండా రక్షింపబడిన 140 గోమాతల కొరకు భూదానం చేసిన  దాతలకు మా ధన్యవాదములు.  విశాలమైన  భూమిలో  శాశ్వత గోశాల భవన నిర్మాణము  జరుగుతున్నది. సెల్ : 9701594519.గో ప్రేమికు లయిన గోశాల నిర్మాణ దాతలకు విన్నపము.

100 చ.అ.నిర్మాణమునకు విరాణము రూ 0116/—

50చ.అ.నిర్మాణమునకు విరాణము రూ 40116/—

25చ.అ.నిర్మాణమునకు విరాణము రూ 20116/—

12 చ.అ.నిర్మాణమునకు విరాణము రూ 10116/—

6చ.అ.నిర్మాణమునకు విరాణము రూ 5116/—

దాతల పేర్లు గోశాలలో ప్రముఖముగా ప్రదర్శించబడును.దాతలకు గోశాలలో ఉచిత వసతి,భోజనము ఏర్పాటు చేయబడును.విరాళములకు ఆదాయం పన్ను 80 జి రాయితీ కలదు.

సెల్ 9701594519, Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

జై గోమాత ! జై వేదాద్రి నారసంహ !

 

 బ్రాహ్మణ సత్రం ` వేదాద్రి క్షేత్రం:

మన సాంప్రదాయం ప్రకారం ప్రతి రోజూ, ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి దానం చేయాలి. అవసరమైన వాళ్ళకు దానం చేయడం వల్ల మనకు పుణ్యం రావడమే కాక మనం తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ కరిగిపోతాయని చెబుతారు. దానాల్లో ముఖ్యమైనది అన్నదానం. 

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదాతను భగవత్‌ స్వరూపునిగా భావిస్తారు. నిత్యఅన్నదానంలో పాల్గొనడం వల్ల మీరు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటారు. సుదూరప్రాంతాల నుంచి వేదాద్రి క్షేత్రానికి వచ్చే బ్రాహ్మణుల సౌకర్యార్థం జగ్గయ్యపేట మండలం చెన్నూరు సమీపంలో బ్రాహ్మణ సత్రంను నిర్మించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వచ్చిన భక్తులకు అన్నదానం చేయాలన్నది నిర్వాహకుల ఆశయం. 

అన్నదానం చేయాలనుకున్న దాతలు తమ పుట్టినరోజు కాని, పెళ్ళిరోజు, మాతా,పిత్రు తిధి రోజుల్లో లేదా వారికి ఇష్టమైన రోజుల్లో అన్నదానం చేయవచ్చు. 

 

శ్రీ వేదాద్రి గోశాల:

శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా భక్తులకు అన్నదానం చేస్తూ, మరోవైపు గోమాత సంరక్షణకు పాటుపడుతూ వస్తోంది. గోమాత భూమాతకు ప్రతీకగా పురాణాలు పేర్కొంటున్నాయి. గోదానం అనంత పుణ్యప్రదమన్న విషయం తెలిసిందే. గో సేవ సర్వదేవతా సమారాధనతో సమానమంటారు. గోమాత శరీరంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. గోమాతకు చేసే సేవ ఏదైనా భగవంతుడిని సంతృప్తిపరుస్తుంది. ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాల నిర్వహణలో భక్తులు కూడా పాలుపంచుకోవాలని ట్రస్టు భావిస్తోంది. ఇటీవల శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌లోని కబేళాకు తరలుతున్న దాదాపు 140 ఆవులను సంరక్షించి వాటికి గోశాలలో ఆశ్రయం కల్పించడం జరిగింది. ఈ ఆవుల ఒక్కరోజు పోషణ ఖర్చు దాదాపు 1650 అవుతోంది. ఇందులో పనివారుల వేతనం, పచ్చిమేత వగైరాలు ఉన్నాయి. భక్తులు కూడా గో సంరక్షణ నిమిత్తం ఒకరోజు పోషణ ఖర్చును విరాళంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.

IMG 20161221 WA0002